ఓంకారమమలేశ్వరం
4. ఓంకారమమలేశ్వరం...... ఇప్పుడు ఆ శ్లోకంలోని నాలుగో క్షేత్రాన్ని చూద్దాం. అదే మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వరంలో వున్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. నర్మదానది ప్రవహించే ప్రాంతం. నర్మదానది ఇక్కడ వున్న ఒక కొండ వల్ల రెండుగా చీలి నర్మదా, కావేరి అనే రెండు పేర్లతో ప్రవహించి మళ్ళీ ఇక్కడే ఆ రెండు పాయలూ కలిసి తిరిగి నర్మదగానే ప్రవహిస్తుంది. ఈ కొద్ది ప్రాంతం అంతా ఒక లంక వలే ఏర్పడి నదికి ఒకవైపు కొండమీద ఓంకారేశ్వర లింగం, నదియొక్క రెండోవైపు భూమిమీద మమలేశ్వరలింగం ఉంటాయి. ఈ కావేరి వేరు, కర్ణాటక, తమిళనాడులో ప్రవహించే కావేరీనది వేరు. కేవలం పేరు ఒక్కటే, అంతే. స్వచ్ఛమైన గాలి, నీరు ఇక్కడ కూడా పుష్కలం. ఈ కొండ ॐ అనే ఆకారంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం అంతా ఓంకారేశ్వరం అంటారు. ఆదిశంకరులు ఈక్షేత్రం గురించి ఈవిధంగా చెప్పారు. కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ | సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే || ఈ శ్లోకార్ధం ఏమిటంటే, నిత్యమూ వసంతాన్ని తలపించే ప్రదేశంలో కావేరీ, నర్మదా నదుల సంగమ స్థలమైన మాంధాతృపురిలో సజ్జనులందరినీ తరింప చేయటానికి వెలసిన ఓంకారేశ్వరునకు ప్ర...