పోస్ట్‌లు

అక్టోబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

నిర్వాణషట్కమ్

  నిర్వాణషట్కమ్....1  మనో బుధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే  న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ భావం: "నేను" అనేది మనసూ కాదు, బుద్ధీ కాదు, అహంకారమూ కాదు, చిత్తమూ కాదు. "నేను" అనేది శ్రోత్రేంద్రియము, రసనేంద్రియము, ఘ్రాణేంద్రియము, చక్షురింద్రియములు కూడా కానే కాదు. "నేను" అనేది ఆకాశము, భూమి, తేజస్సు, వాయువు కూడా కాదు.  ఆత్మను  మనో బుద్ధ్యహంకార చిత్తాలతో   దేనితోనూ పోల్చలేము. ఆత్మ అంటే జ్ఞానేంద్రియాలూ కావు. దానికి పాంచభౌతిక రూపమూ లేదు. "నేను" ఎప్పుడూ నిత్యచైతన్యంగా, శుభస్కరంగా వెలుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ "నేను" అనేది ఆ ఒక్క చిదానంద స్వరూపమే. కనుకనే ఆత్మ ఎప్పుడూ సుఖము, మోక్షము ఇచ్చే శివ స్వరూపమే. " నేనే" శివుడను.  నిర్వాణషట్కమ్....2 న చ ప్రాణ సంజ్ఞో న వైపంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః  నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్  భావం: "నేను" అనేది ప్రాణమూ కాదు, ప్రాణశక్తీ కాదు. పంచ వాయువులతో కూడిన పంచప్రాణాలూ కాదు. "నేను" అనేది చర్మ, రక్త...