నిర్వాణషట్కమ్
నిర్వాణషట్కమ్....1
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్
భావం: "నేను" అనేది మనసూ కాదు, బుద్ధీ కాదు, అహంకారమూ కాదు, చిత్తమూ కాదు. "నేను" అనేది శ్రోత్రేంద్రియము, రసనేంద్రియము, ఘ్రాణేంద్రియము, చక్షురింద్రియములు కూడా కానే కాదు. "నేను" అనేది ఆకాశము, భూమి, తేజస్సు, వాయువు కూడా కాదు. ఆత్మను మనో బుద్ధ్యహంకార చిత్తాలతో దేనితోనూ పోల్చలేము. ఆత్మ అంటే జ్ఞానేంద్రియాలూ కావు. దానికి పాంచభౌతిక రూపమూ లేదు. "నేను" ఎప్పుడూ నిత్యచైతన్యంగా, శుభస్కరంగా వెలుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ "నేను" అనేది ఆ ఒక్క చిదానంద స్వరూపమే. కనుకనే ఆత్మ ఎప్పుడూ సుఖము, మోక్షము ఇచ్చే శివ స్వరూపమే. "నేనే" శివుడను.
నిర్వాణషట్కమ్....2
న చ ప్రాణ సంజ్ఞో న వైపంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశాః
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్
నిర్వాణషట్కమ్....3
న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్
భావం: "నా"కు ద్వేషమూ లేదు, రాగమూ లేదు. "నా"కు లోభమూ లేదు, మొహమూ లేదు. "నా"కు మదమూ, మత్సరమూ కూడా లేవు. అంతేకాదు, "నా"కు ధర్మ, అర్ధ, కామ, మోక్షములు కూడా ఏమీ లేవు, అంటవు. "నేను" ఎల్లప్పుడూ మోక్షము లోనే ఉంటాను, కనుక "నా"కు వేరే మోక్షమనేదే లేదు. "నేను" ఎప్పుడూ నిత్యచైతన్యంగా, శుభస్కరంగా వెలుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ "నేను" అనేది ఆ ఒక్క చిదానంద స్వరూపమే. కనుకనే ఆత్మ ఎప్పుడూ సుఖము, మోక్షము ఇచ్చే శివ స్వరూపమే. "నేనే" శివుడను.
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్
భావం: "నా"కు పుణ్యమూ అంటదు, పాపమూ అంటదు. "నా"కు సుఖమూ తెలియదు, దుఃఖమూ తెలియదు. "నేను" మంత్రాన్ని కాదు, తీర్థాన్ని కాదు, వేదాన్ని కాదు, యజ్ఞాన్ని కాదు. ఇటువంటి భౌతిక క్రియలేవీ కూడా "నేను" కాదు. నేను" భోజనం చేసే అనుభూతినీ కాదు, భుజించే పదార్ధమూ కాదు, భోజనం చేసే భోక్తనూ కాదు, భోజనాన్నీ కాదు. అటువంటి శారీరిక అనుభవాలు "నా"కు లేవు. "నేను" ఎప్పుడూ నిత్యచైతన్యంగా, శుభస్కరంగా వెలుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ "నేను" అనేది ఆ ఒక్క చిదానంద స్వరూపమే. కనుకనే ఆత్మ ఎప్పుడూ సుఖము, మోక్షము ఇచ్చే శివ స్వరూపమే. "నేనే" శివుడను.
న మృత్యుర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్
భావం: "నేను" మృత్యువును కాదు, "నా"కు భయమూ, విచారమూ కూడా లేవు. "నా"కు జాతి, కుల భేదాలు లేవు. "నా"కు తల్లీ, తండ్రీ లేరు, "నా"కు పుట్టుకా లేదు. "నా"కు బంధువులు లేరు, స్నేహితులూ లేరు. "నా"కు గురువూ లేడు, శిష్యులూ లేరు. అటువంటి బంధాలు, సంబంధాలు ఏవీ "నా"కు లేవు, అంటవు. "నేను" ఎప్పుడూ నిత్యచైతన్యంగా, శుభస్కరంగా వెలుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ "నేను" అనేది ఆ ఒక్క చిదానంద స్వరూపమే. కనుకనే ఆత్మ ఎప్పుడూ సుఖము, మోక్షము ఇచ్చే శివ స్వరూపమే. "నేనే" శివుడను.
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న చాసంగతం నైవ ముక్తిర్న మేయః
(న వా బంధనం నైవ ముక్తిర్న బంధః) (పాఠ్యభేదం)
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి